హీరో సూర్య.. మాస్ చిత్రనికి విడుదల తేదీ లాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తను నటించిన తాజా చిత్రాలు రెండు “ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ “. సినిమాలు నేరుగా ఓటిటీలోనే విడుదలయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలు హీరో సూర్య కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచాయి. కానీ ఈ సినిమాలు థియేటర్లో విడుదల కాలేదని సూర్య అభిమానులు కాస్త బాధ పడ్డారు.

అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే హీరో సూర్య సందడి చేయనున్నట్లు గా తెలుస్తోంది. ఈసారి కూడా సరికొత్త కథతో, ఒక మాస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ పాండిరాజ్ తో  “ఎతరక్కుమ్ తునిందవన్” అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ మీద.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు గాను విడుదల తేదీ ని ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమాని ఫిబ్రవరి 4వ తేదీన 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Share.