శర్వానంద్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విశేషమైన ప్రేక్షకాదర పొందిన నటులలో శర్వానంద్ కూడా ఒకరు. ఇటీవల ఒకే ఒక జీవితం సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈయన పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శర్వానంద్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు రాంచరణ్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు రామ్ చరణ్ తో పాటు మెగా కుటుంబంలో ఒకడిగా పెరిగారు. దీంతో మెగా అభిమానుల సపోర్టు కూడా శర్వానంద్ కు బాగా ఉంది.
ఇదిలా ఉండగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ఇంకెప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం శర్వానంద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బాగా వైరలయ్యాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే బయటకు వెలువడలేదు. కానీ తాజాగా బయటకు వచ్చిన ఫోటోలను చూస్తే రక్షిత రెడ్డిని శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, ఉపాసన ఈ వేడుకకు హాజరయ్యి కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షిత రెడ్డి ఎవరో కాదు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె అంతే కాదు వీరికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. ప్రస్తుతం రక్షిత రెడ్డి యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే శర్వానంద్ , రక్షిత రెడ్డి లది పెద్దలు కుదిరిచిన వివాహం అన్నట్టుగా వార్తలు బయటకొస్తున్నాయి. ఏదిఏమైనా బ్యాచిలర్ లైఫ్ వీడి శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడని తెలిసి పలువురు ప్రేక్షకులు, అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.