శివ శంకర్ మాస్టర్ సేవలు మరువలేము అంటున్న కార్తీ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటుడు మృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాదులోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.శివ శంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మరణవార్త విన్న ప్రముఖులు సంతాపం తెలియజేశారు.ఇదిలా ఉంటే తాజాగా హీరో కార్తీ శివ శంకర్ మాస్టర్ మృతి పై స్పందించారు.

శివశంకర్‌ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారం..ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని తాజాగ ట్వీట్‌ చేశారు.అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శివశంకర్‌ మాస్టర్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

మాస్టర్ తో అనుబంధాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.లు చిత్రాలకు శివశంకర్‌ మాస్టర్‌తో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు.  శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు హైదరాబాదులోని మహాప్రస్థానం లో జరిగాయి.

Share.