టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అప్పటి హీరో లలో అర్జున్ కూడ ఒకరు.. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మరియు మలయాళం భాషల్లో హీరోగా నటించాడు. ఇప్పుడు అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదే రేంజిలో రాణిస్తూ నేటితరం ఆడియన్స్ను కూడా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే..
ఈ విషయం కాస్త పక్కన పెడితే అర్జున్ కి ఇద్దరు కూతుర్లు వారిలో పెద్దమ్మాయి ఐశ్వర్య ఆమె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈమెకు సరైన సక్సెస్ మాత్రం రాలేదు. అందుకే అర్జున్ ఆయన కూతురు బాధ్యతలను తన భుజానపైన వేసుకొని ఆయన దర్శకత్వంలోనే ఈమెని హీరోయిన్గా పెట్టి ఒక సినిమాను చేశాడు.
అంతే కాకుండా ఈ సినిమా ఓపెనింగ్ కి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి క్లాప్స్ కొట్టాడు కానీ ఈ సినిమా అభ్యంతరంగా ఆగిపోయింది. ఇలా కెరీర్ పరంగా అర్జున్ తన కూతురుని ఎదగడానికి ఎంతో ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆయన తన కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఐశ్వర్య తమిళ హీరో అయినా ఉమాపతి ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయి.
ఉమాపతి ఎవరో కాదు కోలీవుడ్ లెజెండ్ తంబి రామయ్య కి స్వయాన మనవడు..గత రెండేళ్లుగా ఐశ్వర్య ఉమాపతి ప్రేమించుకుంటున్నారట. కుర్రాడు చూస్తే మంచివాడు కుటుంబం కూడా ఎంతో ఉత్తమమైనదని అర్జున్ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అటుపక్క ఉమాపతి కుటుంబం కూడా ఓకే చెప్పి వీరిద్దరి పెళ్లి ఇంక తేడా అదే జరిపించాల్సి ఉంది.. కానీ ఐశ్వర్య నే కెరీర్లో కాస్త స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందట.
అయితే ఇప్పటి వరకు కూడా ఆమె సక్సెస్ సాధించలేదు.. దీంతో అర్జున్ పెళ్లి తర్వాత అయినా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. అని చెప్పటంతో వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఐశ్వర్య.