చాలామంది సినీ ఇండస్ట్రీలోకి రావడానికి బ్యాక్ గ్రౌండ్ కావాలి. అయితే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు కూడ అజిత్. ఇక అజిత్ పర్సనాలిటీ ఆకట్టుకునే రూపం మంచి అందం, స్టైలిష్ హెయిర్ స్టైల్.ఇలా ఈ హీరోకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అజిత్ తమిళంలో తిరుగులేని హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య అజిత్ ఎందుకో తప్పటడుగులు వేస్తూన్నారు. సినిమాల కథ కథనం ఎంచుకోవడంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారని అభిమానులు భావిస్తున్నారు.
మొన్న సంక్రాంతికి తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్.ఈ సినిమాని తెలుగు లో తెగింపు అనే పేరుతో డబ్ చేసి వదిలారు. గతంలో అజిత్ తీసిన వాలిమై చిత్రం చూసినట్టే అనిపిస్తోంది. కానీ కొత్త సినిమా చూశాము అని ఫీలింగ్ ఎక్కడా రాలేదు.అజిత్ కి కథలే లేనట్టు ఇలాంటి సినిమాలను ఎంచుకుంటున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈమధ్య అజిత్ తీసే సినిమాలు గుర్తుపెట్టుకోదగ్గ సినిమాలలా కనిపించటం లేదు.
ఇక వివేకం, విశ్వాసం వంటి సినిమాలు అసలు జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇలాగే ఇలాంటి సినిమాలనే తీస్తే చివరికి అజిత్ ను కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంది. ఇక విజయ్ తో వారసుడు సినిమాతో పోటీపడ్డ తెగింపు కచ్చితంగా తేలిపోయింది అని చెప్పవచ్చు. తెగింపు సినిమా చూశాక ఎక్కడో ఒక మూల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట గుర్తుచేసేలా అనిపిస్తుంది. ఈ సినిమాలో అజిత్ కన్నా సముద్రఖనీ పాత్రతో చాలామంది కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ప్రాధాన్యత లేని పాత్ర వేస్తే జనాలు ఎంతగానో ఇష్టపడ్డారు కానీ రోజులు మారిపోతున్నాయి. వైవిధ్యం లేకుండా మూస కథలను తీసుకుంటే ప్రేక్షకులు వాటిని తిప్పికొట్టేస్తున్నారు.అజిత్ సినిమాలను తమిల్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.