తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ఏదో ఒక విషాదం వెంటాడుతూనే ఉంది. మొన్నటికి మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా వ్యాధితో మృతి చెందగా నిన్నటికి నిన్న ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిమోనియా వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. నేడు ప్రముఖ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి చెందాడు. ఆయన తమ్ముడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో ఇవాళ ఉదయం మరణించాడు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు రామాంజులు రెడ్డి. . దీంతో హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా వరుస విషాదాలు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.