Hema..సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుపొందింది నటి హేమ (Hema).. ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించింది ఈమె..సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కోసం ఎంతోమంది ఆర్టిస్టులు పలు సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉన్నాము. అలాగైనా అవకాశాలు వస్తాయి అంటే చెప్పలేమని చెప్పవచ్చు. కొంతమంది ఆర్టిస్టులకు మాత్రం కొంతమంది డైరెక్టర్లు మంచి క్యారెక్టర్లు రాస్తూ ఉంటారు.అయితే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం కొంతమంది చాలా సినిమాలలో కనిపించడం జరుగుతూ ఉంటుంది.
అలాంటి లిస్టులో నటి హేమ కూడా ముందు వరుసలో ఉంటుంది. హేమ ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన చిత్రాలలోనే నటిస్తూ ఉంటుంది. ఈమె ముఖ్యంగా విజయం భాస్కర్ డైరెక్షన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో బాగా నటించింది. ఇక ఇప్పటివరకు బాగానే ఉన్న హేమ అనుకోకుండా సినిమాలలో కనిపించలేదు. ఒకవేళ కనిపించిన ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లలో మాత్రమే కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
హేమ ఆఫర్లు తగ్గిపోవడానికి కారణం ఆమెకి పోటీగా చాలామంది కొత్త ఆర్టిస్టులు రావడం.. ఆమె చేసిన పాత్రలు వాళ్ళు కూడా చేయడంతో డైరెక్టర్లు కొత్త ఫేస్ అయితే క్యారెక్టర్లు చాలా ఫ్రెష్ గా ఉంటుందని కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఈమెకు మళ్లీ ఒక మంచి సినిమాలలో క్యారెక్టర్ కనబడితే కచ్చితంగా సినిమాలలో రాణిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
అలాగే పలు సినిమాలలో అవకాశాలు కూడా వస్తాయని చెప్పవచ్చు.. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్లు ఎక్కువగా కామెడీ చేస్తూ ఉండడంతో కమెడియన్ల హవా కూడా బాగానే తగ్గిపోతుంది. మరి రాబోయే రోజుల్లో కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత మంది తగ్గిపోయే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.