ఎనర్జిటిక్ హీరో రామ్, నూతన దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ” హలో గురు ప్రేమ కోసమే “, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని అఫీషియల్ గా విడుదల చేసారు చిత్ర బృందం. ప్రముఖ నటి ప్రణీత సుభాష్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమా ట్రైలర్ లో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు దర్శకుడు ఈ మూవీలో చూపించినట్టు అర్ధం అవుతుంది. రామ్ కూడా తన క్యారెక్టర్ లో బాగా కనెక్ట్ అయ్యాడని తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మారో సారి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి చాల రోజుల తర్వాత ఈ సినిమాలో తన నటనతో మరో సారి ఆకట్టుకున్నారు. దసరా కానుకగా ఈ సినిమాని అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నారు.