సినిమా రంగంలో హీరోయిన్లతో హీరోలు ప్రేమలో పడడం లాంటివి తరచూ జరుగుతూనే ఉంటుంది.. ఇప్పటికీ చాలామంది డేటింగ్ పేరుతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. మరికొందరేమో ఆ డేటింగ్లో వివాహం వరకు తీసుకొని సెటిల్ అయినా జంటలు చాలానే ఉన్నాయి. మరి కొందరు మాత్రం ప్రేమ వరకే తమ రిలేషన్ అడ్డుపెట్టుకొని ఆ తరువాత వదిలేస్తూ ఉంటారు. తాజాగా గ్లామర్ హీరోయిన్ గా పేరు పొందిన హెబ్బా పటేల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
గతంలో నటుడు రాజ్ తరుణ్ తో ఎక్కువ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పైన చూసిన వారంతా వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు కూడా వినిపించేలా చేశాయి.. అప్పట్లో వీరిద్దరూ తరచూ బయట కూడా తిరుగుతూ ఉండేవారు దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు మరింత వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలపై ఒకసారి మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ ఓపెన్ కామెంట్స్ చేయడం జరిగింది.
నేను కూడా రాజ్ తరుణ్ తో వస్తున్న రూమర్లను విన్నాను అవి నాకు తెలియదు అనుకోకండి కాకపోతే మేము దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఇక కొంతమంది మీడియా వారు ఏకంగా మా ఇద్దరి మధ్య ఏదో కొనసాగుతోంది అంటూ రాసేస్తున్నారు.. అది చాలా ఫన్నీగా అనిపించింది.. కావాలంటే మీరు ఏమైనా రాసుకోండి నేను అసలు పట్టించుకోను నాకు ఎఫైర్ ఉందని రాసిన నో ప్రాబ్లం అంటూ కూడా డైరెక్ట్ గా చెప్పేసింది హెబ్బా పటేల్..
దీంతో హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ మధ్య ఏమీ లేదని చెప్పకనే తెలియజేసింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాల ఉపయోగించుకుంటూ మంచి సక్సెస్ను అందుకుంటోంది. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది హెబ్బా పటేల్. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.