అవకాశం ఇస్తామని చెప్పి వాడుకున్నారు.. నటి షాకింగ్ కామెంట్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీ అంటే ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ వంటివి వినిపిస్తూ ఉంటాయి.. ఈ విషయంపై ఎంతోమంది నటిమనుల సైతం స్పందించడం జరిగింది. మీటు ఉద్యమం తర్వాత ఎంతోమంది బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయానులను గురించి అనుభవాలను గురించి తెలియజేయడం జరిగింది. ఎంతోమంది నిర్మాతలు డైరెక్టర్ల మీద పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది హీరోయిన్స్.. అయితే కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నామని తెలియజేయగా మరి కొంతమంది దీనికి బలైపోయారని చెప్పవచ్చు.

casting couch Archives - All Time Report Latest Telugu News, Telugu News

ఇప్పుడు తాజాగా ఒక నటి ఇలాంటి విషయంపై షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది.ఆమె ఎవరో కాదు నటి శిరీష.. ఇప్పటికే తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో నటించింది. అయితే ఈమె జూనియర్ ఆర్టిస్టుగా బాగానే పేరు సంపాదించుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమె క్యాస్టింగ్ కౌచ్ పైన పలు రకాల షాకింగ్ కామెంట్లు చేసింది. శిరీష మాట్లాడుతూ తాను కూడా గతంలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యానని తెలియజేసింది.

అవకాశాల కోసం చాలామంది కమిట్మెంట్లు ఇచ్చాను .. తనని శారీరకంగా కూడా వాడుకున్నారని కానీ నాకు ఎలాంటి సహాయం చేయలేదని అప్పుడు నన్ను వాడుకున్న వారికి ఇప్పుడు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయలేదు వారంతా ఇప్పుడు స్టార్ పొజిషన్లో ఉన్నారని తెలియజేస్తుంది శిరీష.. దీంతో ఇలాంటి వారిని నమ్మి నేను చాలా పొరపాటు చేశాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేయడం జరిగింది.

తనకు ఇప్పుడు ఎలాంటి అవకాశాలు రాలేదని దీంతో ఇల్లు కడవడం కూడా చాలా కష్టంగా ఉందని తనకు ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలియజేస్తోంది శిరీష ఈ విషయం విన్న పలువురు నెటిజన్లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో శిరీష వారి పేర్లను బయట పెడుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Share.