టాలీవుడ్ లోకి మొట్టమొదటిగా ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా సినిమాలో తన అందాన్ని, నటనతో, డాన్స్ తో తన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తెలుగులో ఫిదా తో ..మలయాళం లో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తను చేసే ప్రతి సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లోనే పోషిస్తూ ఉంది సాయి పల్లవి.
ఈ మధ్యనే విరాటపర్వం, గార్గి సినిమాలలో నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ మధ్యనే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిందనే చెప్ప వచ్చు.. ముఖ్యంగా సాయి పల్లవి విషయంలో చెప్పాలంటే తనకు రొమాంటిక్ సీన్స్ అన్న మోడ్రన్ డ్రెస్సులు అన్న కాస్త దూరంగా ఉంటుంది..కానీ సాయి పల్లవి ఒక సినిమాలో లిప్ లాక్ చేసింది. ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం..
డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యకు లిప్ లాక్ ఇచ్చిందట. ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంది. దాన్ని చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశారు దర్శకుడు. ఆ సినిమాలో ఒరిజినల్ గా లిప్ లాక్ ఉండదు నిజానికి అది లిప్ లాక్ కాదు సినిమాలో హైలెట్ గా ఉంటుందని సాయి పల్లవి ని ఒప్పించారట. అంతేకాకుండా ఆ సినిమాకు లిప్ లాక్ అవసరం కావడంతో సాయి పల్లవి కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉన్నది.