యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రలలో చత్రపతి కూడ ఒకటీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంత అద్భుతంగా తెరకెక్కించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటుడు ప్రదీప్ రావత్ నటించడం జరిగింది. చత్రపతి సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు. విలన్ గా కూడా బాగానే ఆకట్టుకున్నారు ప్రదీప్ రావత్.. అయితే ఈయన అసలు పేరు కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు ఎక్కువగా ఈయనని చత్రపతి విలన్ అని పిలుస్తూ ఉంటారు.
వాస్తవానికి ప్రదీప్ రావత్ లగాన్ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ లో చేయడం జరిగింది. ఈ సినిమా చూసి రాజమౌళి ఆయన సినిమాకు సై సినిమాలో విలన్ పాత్రలో అలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. విలన్ గా పేరుపొందిన ప్రదీప్ రావత్ ది జబల్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
చత్రపతి సినిమా తర్వాత ఈయన తెలుగులో వరుస సినిమాలలో విలన్ గా నటించారు. అలా దేశముదురు, రాజన్న ,పూలరంగడు , రగడ అల్లుడు శీను తదితర చిత్రాలలో విలనుగా నటించి మెప్పించారు.
అయితే ఇంత విలనిజాన్ని చూపించిన ప్రదీప్ భార్య చూడడానికి హీరోయిన్ లాగ అందంతో కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రదీప్ రావత్ భార్యకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈమె పేరు అన్సా సింగ్. ఇటీవలే ఈమె పుట్టినరోజు వేడుకలను కూడా ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావత్ వారితో కలిసి సందడి చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు మారుతున్నాయి. ఈ విలన్ భార్యని చూసి నేటిజన్లు ఇంత అందమైన భార్య ప్రదీప్ రావత్ భార్య అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు.