Hariteja: వైరల్ గా మారుతున్న హరితేజ ఫొటోస్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Hariteja..బుల్లితెరలో కానీ వెండితెరలో కానీ ఆర్టిస్టులు కూడ హీరోయిన్లలాగా సన్నబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సన్నగా అయిపోయి అందరికీ షాక్ లు ఇస్తుంటారు. అయితే ఆ లిస్టులో చేరిపోయింది నటి హరితేజ (Hariteja). ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. మొట్టమొదటిగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక నటనపరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది హరితేజ. వెండితెరలోనే కాకుండా బుల్లితెరపై కూడా మనసు మమత సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఒకవైపు సినిమాలలో మరోవైపు సీరియల్స్ లోనే కాకుండా బుల్లితెర యాంకర్ గా పలు షోలలో యాంకర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి చివరి వరకు హౌస్ లోనే ఉంటూ మూడో స్థానంలో నిలిచింది హరితేజ . మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందుతున్న సమయంలోనే వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయినా ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది హరితేజ.

అయితే ఒకప్పుడు హరితేజ చూడటానికి లావుగా ఉండేది. కానీ ఇప్పుడు పెట్టిన ఫోటోలు చూస్తే ఎవరు గుర్తుపట్టలేనంతగా సన్నబడింది. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకోగా ఆ ఫోటోలలో ఈమె చాలా సన్నబడినట్లు కనిపించింది. ఇంత సడన్గా ఈమె సన్నబడడంతో అందరూ షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు బొద్దుగా ఉన్న హరితేజ ఉన్నట్టుండి బక్క చిక్కి పోవడానికి జిమ్ సెంటర్లే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే హరితేజ ను చూసి ఆమెని పొగడ్తలతో కొంతమంది పొగుడుతున్నారు. హరితేజ చాలా సన్నగా అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరికొందరు బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఫోటోలను చూస్తుంటే అవకాశాల కోసం ఇంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

Share.