నా సినిమా తొలగించారు..అందుకు బాధపడ్డ: హరీష్ శంకర్

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. అటు తర్వాత హరీష్ శంకర్ కి ఆ స్థాయి హిట్ లేదనే చెప్పాలి. తెలుగులో రవి తేజ, పవన్ కళ్యాణ్ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు హరీష్. అయితే తాజాగా తాను తీసిన చివరి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మించిన డీ జె, రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మంచి హిట్ సొంతం చేసుకున్నాయి.
ఇక లేటెస్ట్ గా హరీష్ దర్శకత్వం వహించే మల్టీస్టారర్ ని దిల్ రాజు నిర్మించవలసి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాల వలన దిల్ రాజు హరీష్ మల్టీస్టారర్ ని నిర్మించటం లేదని ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ రోజు దిల్ రాజు తన అఫిషియల్ ట్విట్టర్ ద్వారా తన సంస్థలో విడుదలకి సిద్ధంగా ఉన్న తదుపరి అయిదు చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు, ఈ జాబితాలో హరీష్ శంకర్ సినిమా లేకపోవటంతో బాధపడ్డ హరీష్ ఒక ట్వీట్ చేసారు.
హరీష్ ట్వీట్ చేస్తూ ‘ఈ జాబితా నుండి నా సినిమా మిస్ అయ్యింది, ఆశ్చర్యకరంగా ఉంది…కానీ కొన్ని సార్లు కొన్ని తప్పవు…ఈ ఐదు చిత్రాలు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అని బాధతో ట్వీట్ చేసారు’ హరీష్ శంకర్.

Share.