నందమూరి హరికృష్ణ తాజాగా రోడ్డు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలయ్యాడు. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని అన్నెపల్లి సమీపంలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఇందులో కారు నడుపుతున్న హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.
ఆయన తలకు మరియు చాతికి బలమైన గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటనే కామినేని ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రమాదం జరిగిన చోటుకు దగ్గరగా హరికృష్ణ పెద్ద కొడ్డుకు నందమూరి జానకి రామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఇక కొద్దీ సేపటి క్రితమే ఆసుపత్రి వర్గాలు హరి కృష్ణ చనిపోయారని ధృవీకరించారు.