హ్యాపీ వెడ్డింగ్ కలెక్షన్స్ ఈ స్థాయిలో ఊహించలేదు

Google+ Pinterest LinkedIn Tumblr +

కొణిదెల నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హ్యాపీ వెడ్డింగ్’ పోయిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేసారు. యువి క్రియేషన్స్ మరియు పాకెట్ మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ కథాంశం, సాగదీత స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కల్లెక్షన్లని రాబట్టలేకపోయింది.
ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం 25 లక్షలు మాత్రమే వసూలు చేయగా ఆదివారం హాలిడే అయినా కూడా 20 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. కొణిదెల వారి అమ్మయికి మరో సారి నిరాశ తప్పేలా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ చిత్రం కొంత వరకు అలరించ వచ్చు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

Share.