నందమూరి బాలకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం వీరసింహారెడ్డి. దీంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక అంతేకాకుండా తమ అభిమాన హీరో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తాజాగా నిన్నటి రోజున చిత్ర బృందంతో కలిసి వీరసింహారెడ్డి విజయోత్సవాన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరి శంకర్, అనిల్ రావిపూడి, హనురాగవపూడి తదితరులు హాజరయ్యారు.
ఈ సక్సెస్ మీట్ పూర్తయిన వెంటనే బాలయ్య, విశ్వక్ సేన్, హీరోయిన్ హనీ రోజ్ తో కలిసి స్పెషల్ పార్టీ చేసుకున్నారు.ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒక ఫోటో అందర్నీ ఆశ్చర్యానికి కలిగించేలా చేస్తోంది. ఈ ఫోటోలో బాలకృష్ణ హనీ రోజ్ తో కలిసి స్టైల్ గా సిప్ వేస్తున్నటువంటి సీన్ కనిపిస్తోంది. ఈ ఫోటో బాలయ్య అభిమానులకు కిక్కిచ్చే విధంగా ఉన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పవచ్చు. కేవలం ఎనిమిది రోజులలోనే దాదాపుగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతంగానే డిస్ట్రిబ్యూషన్ తో రిలీజ్ చేయడంతో నిర్మాతలు భారీగానే లాభాలు చూసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య తదుపరిచిత్రం డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
#Balayya Party with @VishwakSenActor and @HoneyRoseOffl_ after #VeeraSimhaReddy Success Meet 😍 pic.twitter.com/eQZDFzaPcZ
— Sailendra Medarametla (@sailendramedar2) January 23, 2023