గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈమెకు సినీ రంగంతో డైరెక్ట్ గా , ఇన్ డైరెక్ట్ గా ఇప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా సుపరిచితురాలు అయిపోయింది ఉపాసన. ఒకవైపు మెగా ఇంటి కోడలిగా ఇంటి పనులను సక్సెస్ఫుల్గా చక్కబెడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ కు సంబంధించిన మేనేజ్మెంట్ పనులు కూడా చూసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమె.. భర్త రాంచరణ్ తో కలిసి రీసెంట్గా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే ఇక రామ్ చరణ్ దంపతులు దుబాయ్ కి ఉన్నట్టుండి వెకేషన్ కి ఎందుకు వెళ్లారు అన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఉపాసనకు దుబాయిలో శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.. చరణ్, ఉపాసనకు సన్నిహితులు కుటుంబ సభ్యులు కొందరు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ప్రతి ఒక్కరు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక నేటిజన్స్ కి రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మెగా ఫాన్స్ సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా వారసుడు లేదా వారసురాలు రాబోతున్నందుకు వారి ఆనందానికి అవధులు లేవు.
ఇకపోతే ఉపాసన పెళ్లయిన కొత్తలో ఎదుర్కొన్న విమర్శలు బాడీ షేమింగ్ గురించి కూడా కామెంట్లు చేసింది. లావుగా ఉన్నావని కొందరు కామెంట్ చేశారని అలాగే రామ్ చరణ్ డబ్బు కోసమే తనను వివాహం చేసుకున్నారని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారని అయితే అలా విమర్శించిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది మొత్తానికి అయితే ఉపాసన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.