టాలీవుడ్ హీరో గోపీచంద్ ముందుగా హీరోగా ఆ తర్వాత విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆయన కెరియర్లో యజ్ఞం సినిమా ఒక స్టార్ ఇమేజ్ ను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.. ఈ సినిమాని ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు.. ఆ తర్వాత సౌఖ్యం మూవీని రూపొందించగా ఇది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత గోపీచంద్ తో మరే సినిమా కూడా చేయలేదు.. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామి అనే సినిమాని తెరకెక్కించారు.
ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేయగా దిల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో హీరోయిన్ గా మన్నారా చోప్రా కు మీడియా ముందు ముద్దు పెట్టడం జరిగింది డైరెక్టర్ రవికుమార్ చౌదరి.. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ కావడంతో తనకు లేని నొప్పి మీకేంటి అంటూ నెటిజన్ల పైన మీడియా పైన ఫైర్ కావడం జరిగింది డైరెక్టర్ రవికుమార్.
ఇదంతా పక్కన పెడితే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్ పైన ఇన్ డైరెక్టర్గా తిడుతూ వార్తలలో నిలిచారు రవికుమార్.. ఒరేయ్ అంతలా బలిసిందారా నీకు అంటూ హీరో గోపీచంద్ పైన విరుచుకు పడడం జరిగింది.. తనని కలవాలని వెళితే కార్వ్యాన్ లో ఉండి వెయిట్ చేయించాడని మండిపడ్డారు.. ఇంత బలుపు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ సంచల వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఈ వాక్యాల పైన గోపీచంద్ అభిమానులు ఫైర్ అవుతూ పచ్చిగా తాగి మాట్లాడుతున్నావా అంటూ మండిపడ్డారు డైరెక్టర్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారట.. దీంతో డైరెక్టర్ ఎస్వి రవికుమార్ తాను చేసిన వ్యాఖ్యలపైన దిగివచ్చి తాజాగా యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతూ అలా మాట్లాడటం వల్ల తను రీ గ్రేట్గా ఫీల్ అవుతున్నానని గోపీచంద్ తనకు ఎలాంటి గొడవలు లేవని నాకు ఆయన బిడ్డలాంటి వాడని నావల్ల హర్ట్ అయ్యుంటే గోపీచంద్ అభిమానులు క్షమించండి అంటూ కోరుకుంటున్నారు.