మాచో హీరో గోపిచంద్ కు అసలేమాత్రం టైం కలిసి రావట్లేదని చెప్పాలి. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుని చేస్తున్నా సరే అతనికి లక్ తగలట్లేదు. రీసెంట్ గా చాణక్య అంటూ వచ్చిన గోపిచంద్ ఆ సినిమాతో కూడా నిరాశపరచాడు. లేటెస్ట్ గా సంపత్ నంది డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేస్తున్నాడట.
ఎలాగు చేతిలో సినిమాలేవి లేవు.. చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి కాబట్టి గోపిచంద్ తను చేయబోయే ఈ సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా సినిమాకు ఓకే చెప్పాడట. సినిమా ప్రాఫిట్ వస్తే వచ్చిన దానిలో ఎంతోకొంత పర్సెంటేజ్ రిటర్న్ తీసుకుంటా అని చెప్పాడట. మాములుగా ఫాం లో ఉంటే హీరోలు రెమ్యునరేషన్ తో పాటుగా బిజినెస్ లో షేర్ అడుగుతారు.
కాని గోపిచంద్ మార్కెట్ ఈమధ్య బాగా దెబ్బ తిన్న కారణంగా సినిమా పూర్తయి బాగా బిజినెస్ జరిగితే దానిలోంచి రెమ్యునరేషన్ తీసుకుంటాడని చెప్పాడట. మరి ఈసారైనా సరే గోపిచంద్ హిట్ కొడతాడో లేదో చూడాలి. సంపత్ నంది కూడా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. ఇద్దరి కలిసి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.