‘గూఢచారి’ అఫిషియల్ ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గూఢచారి’, ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ని చిత్ర బృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలనాటి నటి సుప్రియ ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ గా కనిపించనున్నారు. అడివి శేష్ కూడా ఈ సినిమాలో ఒక దేశం కోసం పని చేసే ఒక సీక్రెట్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నారు. ఇక ఈ రోజు ప్రముఖ నటుడు నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయించారు సినిమా ప్రొడ్యూసర్స్.

సినిమా ట్రైలర్ బట్టి ఇది ఒక సోషల్ మెసేజ్ తో కూడుకున్న థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది. నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర చేయనున్నారు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. మరో ముఖ్య పాత్రలో నటి లేదు షాలిని నటించింది. శశి కిరణ్ టిక్క ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించగా అభిషేక్ నామ నిర్మాతగా వ్యవహరించారు. ఆగష్టు 3 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Share.