SSMB -28 ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. షూటింగ్ అప్పటినుంచే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో ఎన్నోసార్లు షూటింగ్ వాయిదా పడవలసి వస్తోంది. ఇప్పుడు అన్నిటినీ దాటుకొని తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇదివరకే షూటింగ్ను కూడా ప్రారంభించి మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయినట్లుగా వార్తలు వినిపించాయి. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే కూడా నటిస్తున్నది. పూజా హెగ్డే కి కాలికి ఫ్రాక్చర్ అవడం వల్ల కొద్దిరోజులు షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు మళ్లీ తాజాగా సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

SSMB 28: The Release Date Of This Trivikram Directorial Is Out

గతంలో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడు, ఖాలేజ సినిమాలు విడుదలయ్యాయి. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ లుక్కుల కనిపించబోతున్నట్లు అందుకు కొన్ని ఫోటోలు కూడా వైరల్గా మారాయి. ముఖ్యంగా లాంగ్ హెయిర్ తో పాటు, గడ్డంతో చాలా రఫ్ గా కనిపించబోతున్నారు.

SSMB 28: Mahesh Babu And Trivikram's Untitled Will Go On The Sets From  January…

ఈ సినిమా కోసం మహేష్ బాబు మరొకసారి తన లుక్ ని చేంజ్ చేసినట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా సిక్స్ ప్యాక్ బాడీ లాంగ్వేజ్ ఉండే విధంగా తన శరీరాన్ని డెవలప్మెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ బాబు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ ఫిలిం సర్కిల్లో ఆసక్తికరంగా మారుతోంది. దీంతో మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ జనవరి నుంచి తిరిగి ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోవాలని చిత్ర బంధం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ రాబోతోందని హింట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా చేయలేదు త్వరలోనే చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share.