టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువని చెప్పవచ్చు. గతంలో పోలిస్తే ఈ మధ్యకాలంలో వరుస హిట్ లతో మహేష్ బాబు దూసుకుపోతున్నారు. మహేష్ బాబు కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంతో మహేష్ బాబు లో మాస్ యాంగిల్ ఉందని కూడా నిరూపించారు. ఈ సినిమా 2003 వ సంవత్సరంలో జనవరిలో విడుదలై ఒక ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ మధ్యకాలంలో పాత సినిమాలను మళ్లీ థియేటర్లోకి విడుదల చేస్తూ ఉన్నారు చిత్ర బృందం .ఈ క్రమంలోనే మహేష్ నటించిన పోకిరి చిత్రం మళ్ళీ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో చాలామంది హీరోలు మహేష్ బాటని ఎంచుకొని పలు సినిమాలను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మహేష్ కెరియర్లు ఒక్కడు చిత్రానికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా అప్పట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక అంతే అద్భుతంగా నటించడంతోపాటు విలన్ గా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఒక్కడు సినిమాని జనవరి 7 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించి ప్లానింగ్ పనులు కూడా చిత్ర బృందం మొదలుపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన 28వ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది కీలకమైన పాత్రలో శ్రీ లీల కూడా నటిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రం అయిపోయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన 29వ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎలాంటి ట్రెండ్ సెట్ చేయాలన్న మహేష్ బాబుకి సాధ్యమని చెప్పవచ్చు.