అక్కినేని హీరోకి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సంక్రాంతికి పోటీగా మూడు తెలుగు సినిమాలు ఒక తమిళ సినిమా వచ్చినా పెద్దగా ప్రభావితం చూపించలేదు. ఒక్క ఎఫ్-2 సినిమానే బాక్సాఫీస్ కళకళలాడేలా చేస్తుంది.

అక్కినేని నట వారసుడిగా వస్తున్న అఖిల్ మొదటి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మూడవ సినిమాగా వస్తున్న మిస్టర్ మజ్ను మీద మాత్రం అంచనాలు ఉన్నాయి. అంతేకాద్ సినిమాకు పోటీగా మరే సినిమా లేదు. సంక్రాంతి సినిమాల్లో ఎఫ్-2 సందడి కూడా ముగిసినట్టే. కాబట్టి అఖిల్ సినిమా కాస్త బాగున్నా అఖిల్ కు మొదటి హిట్ దక్కినట్టే. వెంకీ అట్లూరి మొదటి సినిమా తొలిప్రేమ సూపర్ హిట్ అయ్యింది.

వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఆ సినిమా సక్సెస్ తో వెంకీ టాలెంట్ ప్రూవ్ అయ్యింది. మరి దర్శకుడి రెండో ప్రయత్నంగా వస్తున్న ఈ మిస్టర్ మజ్ను కూడా అదే ఫలితాన్ని సొంతం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. అఖిల్ మాత్రం రిలీజ్ ముందే సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి మొదటి హిట్ పక్కా అన్న భావనలో ఉన్నాడు.

Share.