తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ప్రేక్షుకుల ఆదరణ అనేది బాగా ఉంటుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీకి వినోదాన్ని పంచుతూ వసూళ్లు కురిపిస్తున్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన బన్నీ, రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ లు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
వారితో పోటీపడుతూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడం విశేషంగా చెప్పొచ్చు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చేయబోయే సినిమాలను ప్రకటించారు. అందులో లూసీఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా గురించి కూడా చెప్పి ఫ్యాన్స్ కు సంతోషం కలిగించారు. అందులో సల్మాన్ ఖాన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది వెలువడ నుంది.