జ్ఞానపీఠ గ్రహిత గిరిష్ కర్నాడ్ మృతి….!

Google+ Pinterest LinkedIn Tumblr +

జ్ఞానపీఠ అవార్డు గ్రహిత ప్రముఖ కన్నడ నటుడు గిరిష్ కర్నాడ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారత దేశంతోని పలు భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ నటించాడు గిరిష్ కర్నాడ్. కన్నడ రచయితగా, సాహిత్యంలో ఎన్నలేని సేవలు చేసినందుకు ఆయనకు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న మహానటుడు.

గిరిష్ కర్నాడ్ 1938 మే 19న జన్మించారు. ఆయన 1992లో పద్మభూషన్, జ్ఞానపీఠ అవార్డును , 4ఫిలింఫేర్ అవార్డులు, 1984లో పద్మశ్రీతో పాటు పలు జాతీయ అవార్డులను అందుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నాడు. సోమవారం తెల్లవారజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు.

భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన నాటకాలు రచించారు. నాటక రంగంలో చేసిన సేవలకు ఆయనకు జ్ఙానపీట అవార్డును అందుకున్న మొట్టమొదటి నాటక సాహిత్యవెత్త. గిరిష్ కర్నాడ్ తెలుగులో అనేక సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఆనంద బైరవ, ధర్మచక్రం, శంకర్దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో నటించాడు.

Share.