ఆయనో విద్యార్థి నాయకుడు.. విప్లవ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.. విద్యార్థి దశలోనే రౌడీల ఆగడాలను, అక్రమాలను అడ్డుతగిలి తనదైన పద్దతిలో విప్లవభావజాలంతో వాటిని అణిచివేసిన ధీశాలి. విద్యార్థి దశలోనే విప్లవాలకు ఆ విద్యాకేంద్రాన్ని అడ్డాగా మార్చిన ఆ వీరుడు ఎవ్వరో కాదు.. జార్జిరెడ్డి. ఇప్పుడు ఆ వీరుడి జీవిత కథతో తెరకెక్కుతున్న యధార్థ గాధే జార్జిరెడ్డి. ఓ విప్లవవీరుడి కథ తెరకెక్కుతుందంటే ప్రతిఒక్కరికి ఎంతో ప్రేరణగా నిలుస్తుందనే టాక్ ఇప్పుడు వినిపిస్తున్నది.
ఈ తరుణంలో ఈసినిమాను ఎవ్వరు పంపిణి చేస్తారనే అనుమానాలు టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితుల్లో ఈ చిన్న సినిమాగా తెరకెక్కుతున్న జార్జిరెడ్డికి పెద్ద పంపిణిదారు అండగా నేనున్నానని ముందుకు వచ్చాడు. ఇంతకు జార్జిరెడ్డి సినిమాను పంపిణి చేయాలని నిర్ణయించుకుంది అభిషేక్ పిక్చర్స్. ఈ సంస్థకు పెద్ద సంస్థగా పేరుంది. అయితే ఈ సంస్థకు యజమాని అభిషేక్ నామా. ఇప్పుడు ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ ఆధ్వర్యంలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు.
అభిషేక్ పిక్చర్స్ ఇప్పటికే జార్జిరెడ్డి చిత్ర థ్రియోటికల్ రైట్స్‌ను ను సొంతం చేసుకున్నారు. ఈ సంస్థ ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు వంటి హిట్ చిత్రాల రైట్స్‌ను సొంతం చేసుకుని భారీగా విడుదల చేసింది. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ సాధించాయి. ఇప్పుడు ఓ చిన్న సినిమాగా విప్లవవీరుడు జార్జిరెడ్డి చిత్రంను కూడా ఈ పెద్ద సంస్థ చేజిక్కుంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియోట్ అవుతుంది. ఈ సినిమాను జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్నాడు.