గీత గోవిందం ఫస్ట్ డే కలెక్షన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘గీత గోవిందం’ నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండే ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది, విజయ్ దేవరకొండ అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ తెరకెక్కించారు. యు ఎస్ లో కూడా రికార్డు స్థాయిలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ వారు విడుదల చేసారు. కొన్ని రోజుల క్రితం రష్మిక, విజయ్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ లీక్ కావటం కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచేలా చేసాయి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొలి రోజు 9.66 కోట్ల గ్రాస్ 16.1 కోట్ల షేర్ ని వసూలు చేసింది.
నిన్న మెగాస్టార్ స్వయంగా ఈ సినిమాని చూసి విజయ్ దేవరకొండ ని మరియు మొత్తం చిత్ర యూనిట్ ని అభినందించటం ఈ చిత్రానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.

ఏరియా వైజ్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం 1.75
వైజాగ్ 0.70
ఈస్ట్ 0.48
వెస్ట్ 0.45
కృష్ణ 0.46
గుంటూరు 0.62
నెల్లూరు 0.24
ఆంధ్ర 2.95
సీడెడ్ 1.10
నైజాం, ఏ పీ 5.8

యు ఎస్ ఏ 2.31
కర్ణాటక 0.60
రెస్ట్ 0.95

వరల్డ్ వైడ్ టోటల్ షేర్ 9.66 కోట్లు
గ్రాస్ 16.1 కోట్లు

Share.