గీత గోవిందం చిత్ర నిర్మాత షాకింగ్ డెసిషన్

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డితో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం. ఈ సినిమా ఎలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు చూపిస్తోంది. అయితే ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు ఇవ్వనున్నారట చిత్ర యూనిట్.

ఇలా చేస్తే పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? అనేగా మీ సందేహం. కాస్త ఆగండి.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర క్రేజ్ దృష్ట్యా దీనిని కేరళలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమాకు కేరళలో వచ్చే షేర్ కలెక్షన్స్ మొత్తాన్ని కేరళ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ఇచ్చాడు.

మరోవైపు గీత గోవిందం హీరో విజయ్ దేవరకొండ కూడా తనవంతుగా రూ.5 లక్షల విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఇక రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన గీత గోవిందం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేయగా గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు.

Share.