యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుతోంది. అర్జున్ రెడ్డి వంటి ట్రెండ్ సెట్టర్ సినిమా తరువాత విజయ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై యూత్‌లో అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. దీనికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూశారు ఫ్యాన్స్.
ఇక ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కాగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు సెక్సెస్ ఓటును గుద్దేశారు. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మరే ఇతర సినిమా దీనికి పోటీగా లేకపోవడంతో గీత గోవిందం కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా అర్జున్ రెడ్డిని క్రాస్ చేయగా మొదటి వారం ముగిసే సరికి దాదాపు రూ. 40 కోట్ల షేర్ వసూళ్లు సాధించి విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ మూవీగా నిలిచింది. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందాన హీరోయిన్‌గా నటించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 10.55 కోట్లు
సీడెడ్ – 3.90 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.85 కోట్లు
గుంటూరు – 2.06 కోట్లు
ఈస్ట్ – 2.11 కోట్లు
వెస్ట్ – 1.75 కోట్లు
కృష్ణా – 2.10 కోట్లు
నెల్లూరు – 0.83 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 26.15 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 4.65 కోట్లు
ఓవర్సీస్ – 7.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 38.60 కోట్లు