నందమూరి బాల కృష్ణ, శ్రియ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గత ఎడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్ళని సాధించింది. బాల కృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా గౌతమీపుత్ర నిలిచింది. అయితే విడుదలైన సంవత్సరం తరువాత ఈ సినిమా కి హై కోర్ట్ తాజాగా కొన్ని నోటీసులు జారీ చేసింది.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..తాజాగా కోర్ట్ ఈ వినోద పన్ను మినహాయింపు ప్రేక్షకులకు చెందాల లేదా సదరు సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ కి చెందాల అని ప్రశ్నించింది. ఈ విషయం పై రెండు తెలుగు రాష్ట్రాలు త్వరలో సమాధానం చెప్పాలని హై కోర్టు ఆదేశించింది.
గౌతమీపుత్ర శాతకర్ణి కి కోర్టు నోటీసులు, కారణం అదే
Share.