టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాల విడుదల విషయంపై కన్ఫ్యూజన్ మొదలైంది. తీవ్రమైన పోటీ ఎక్కువగా ఉండటంతో కొంత మంది హీరోలు రిస్కు చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా ధాటికి సినిమాలు విడుదలయ్యే వరకు నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా కూడా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా అఖండ సినిమా తో సినీ ఇండస్ట్రీలో కొంత కోలాహలం నెలకొంది. ఇక మిగతా సినిమాలు కూడా మంచి కంటెంట్ తో మెప్పించ గలిగితే..ఎలాంటి సమయంలోనైనా కలెక్షన్లను వసూలు చేస్తుందని చెప్పవచ్చు. గని సినిమా డిసెంబర్ 24 వ తేదీ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.అయితే అదే సమయంలో నాని శ్యామ్ సింగరాయ్ మూవీ కూడా ఈ పోటీకి దిగుతోంది. గని మూవీ కి.. నిర్మాత గా అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మించారు.అందుచేతనే ఆయన ఈ పోటీలో గని సినిమాని విడుదల చేయకూడదని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా వాయిదా వేస్తారో.. అదే రోజుకు విడుదల చేస్తారు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.