తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది గజాల. తన అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ్ వంటి భాషలలో కూడా నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అంతే త్వరగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.మొదట ఈమె 2001లో జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది.
ఆ తరువాత ఓ చిన్నదాన, విజయం, అల్లరి రాముడు ఇలా పలు చిత్రాలలో నటించింది. కానీ గజాల కెరియర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ కలుసుకోవాలని చిత్రాలు మాత్రం మంచి విజయాలను అందించాయి. ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. స్టార్ పొజిషన్ వస్తున్న సమయంలో ఇండస్ట్రీకి దూరమయింది గజాల.
అంతేకాకుండా గతంలో ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని విషయం కూడా పెను సంచలనాలను రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం తాను హైదరాబాదులో ఒక అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని వార్తలు వినిపించాయి. అయితే ఇదంతా ఒక హీరో మోసం చేశాడన్న విషయంతోనే ఈమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని వార్తలు అప్పట్లో వినిపించాయి.ఆ హీరోని ఇష్టపడడంతో ఆ హీరో తో పెళ్లి చేసుకుందామనే సమయానికి ఆ హీరో హ్యాండ్ ఇవ్వడం వల్ల అలా చేసిందని వార్తలు వినిపించాయి.
అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా సమాచారం.. జూనియర్ ఎన్టీఆర్ తో ఈమె వరసగా సినిమాలు చేసి మంచి క్రేజీ సంపాదించింది. ఆ తర్వాత నటించిన ఎన్టీఆర్ సినిమాలలో ఆమెకు డైరెక్టర్లు అవకాశం ఇవ్వలేదు.. ఎన్టీఆర్ మీద పెంచుకున్న ప్రేమకు గజాల ఆయన సినిమాలను నటించే అవకాశం ఇవ్వకపోతే తనకు హిట్స్ పడవని లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బలవంతంగా బాత్రూంలోకి వెళ్లి ఫినాయిల్ తాగిందని సమాచారం. దీంతో అక్కడున్నవారు ఆమెను రక్షించి హాస్పిటల్ కి తీసుకువెళ్లారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి..దీంతో ఆ ప్రాణాపాయం నుంచి బయటపడిందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.. ఆ తర్వాత కొన్నేళ్లకు హిందీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.