హరీష్ శంకర్ డైరెక్షన్లో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దల కొండ గణేష్ ఒక రోజు ముందుగానే పేరు మార్చుకుంది. వాల్మీకి టైటిల్ కాస్తా గద్దల కొండ గణేష్‌గా మారింది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ లభిస్తోంది. అయితే ఏ ఒక్కరు కూడా సినిమా బాగోలేదని మాత్రం చెప్పడం లేదు. సినిమాను ఖచ్చితంగా ఓ సారి చూడాల్సిందే అంటున్నారు.
ఇక ఈ సినిమాలో వరుణ్‌తేజ్ క్యారెక్టర్ అయిన గద్దల కొండ గణేష్ క్యారెక్టర్… ఈ మాస్ సినిమాకు తగ్గట్టు వరుణ్ తేజ్ గెటప్ బాగా కుదిరింది. ప్రతి ఒక్కరు వరుణ్ క్యారెక్టర్‌ను బాగా ప్రశంసిస్తున్నారు. వరుణ్ ఎత్తు, ఉంగరాల జుట్టు, పెద్ద గడ్డం ఈ కేరక్టర్‌కు సూట్ అయ్యాయి. ఇక శ్రీదేవి పాత్రలో కనిపించింది కొద్దిసేపే అయినా పూజా హెగ్డే ఆకట్టుకుంది. అధర్వకి తెలుగులో తొలి సినిమా అయినా మెప్పించాడు. మృణాళిని అల్లరి పిల్లగా బాగా చేసింది.
ఇక సినిమాలో పెళ్లి చూపులు సీన్ బాగా పేలిందని.. కాంప్రమైజ్-అడ్జస్ట్ మెంట్ గురించి తనికెళ్లభరణి చెప్పే డైలాగులు అర్థవంతంగా ఉన్నాయంటున్నారు. ఇందులో బిందెలతో తెరకెక్కించిన ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను బాగా ప్రశంసిస్తున్నారు. ఓవరాల్‌గా చిన్న చిన్న లోపాలు ఉన్నా… రన్ టైం ఏకంగా 170 నిమిషాల పాటు కొన్ని బోరింగ్ సీన్లు ఉన్నా పక్కా మాస్ కమర్షియల్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది అన్న టాక్ బాగా వినిపిస్తోంది.