మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ అయినా వరుణ్‌తేజ్‌కు నేచురల్ స్టార్ నాని గ్యాంగ్‌లీడర్ సినిమా ముందు కష్టాలు తప్పేలా లేవు. వాస్తవానికి వరుణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలను బట్టి చూస్తే మనోడికి క్లాస్ ఇమేజ్ ఎక్కువుగా ఉంది. అయితే గద్దలకొండ గణేష్ సినిమాకు మాత్రం మాస్‌లో మంచి టాక్ వచ్చింది.
ఇక మల్టీఫ్లెక్స్‌లలో ఈ సినిమాకు అంత టాక్ లేదు. అయితే గ్యాంగ్ లీడర్ మల్టీఫ్లెక్స్‌లలో ఇంకా రన్ అవుతోంది. ఈ ఎఫెక్ట్ గద్దలకొండ గణేష్ కి మల్టీఫ్లెక్స్‌లలో తప్పేలా లేదు. గ్యాంగ్‌లీడర్ సినిమాకు రెండో వారంలో వాల్మీకి ఎఫెక్ట్ తప్పదని అనుకున్నారు. ఇక శుక్రవారమే వచ్చిన బందోబస్త్ ఓవరాల్‌గా నిరాశ పరచడంతో ఆ సినిమా పోటీలో లేదని తెలిసిపోయింది.
ఇక గద్దలకొండ గణేష్ మాస్ సెంటర్ల సినిమాగా టాక్ రావడంతో ఆ సినిమా కన్నా ఇటు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ ఎక్కువుగా ఉన్న గ్యాంగ్ లీడర్‌కు మళ్లీ మంచి ఛాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రెండో వారంలోనూ నాని సినిమా పుంజుకునేందుకు ఎక్కువుగా ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటకీ మల్టీఫ్లెక్స్‌లలో ఈ సినిమాకు మంచి టిక్కెట్లే తెగుతున్నాయి.
ఇప్పుడు గద్దలకొండ గణేష్ మల్టీఫ్లెక్స్‌లలో చాలా స్లోగా ఉండడంతో గ్యాంగ్ లీడర్ మళ్లీ పుంజుకుంటే వాల్మీకి హిట్ అయిన ఏ సెంటర్లతో పాటు మల్టీఫ్లెక్స్‌లలో వరుణ్ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. గద్దలకొండ గణేష్ షేర్ కూడా బీ, సీ సెంటర్లలోనే ఎక్కువుగా ఉంది.