“గద్దలకొండ గణేష్” దుమ్ముదులిపేస్తున్నాడుగా.. 5 రోజుల కలక్షన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన జిగుర్ తండా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సూపర్ హిట్ సాధించింది. రిలీజ్ కు నాలుగు గంటల ముందు సినిమా టైటిల్ మార్చినా సరే సినిమాను ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో వరుణ్ తేజ్ నటనకు మెగా ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు సైత ఫిదా అయ్యారు.

24.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా 5 రోజుల్లో 18.5 కోట్లు కలెక్ట్ చేసింది. సో వారం రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ వస్తుందని చెప్పొచ్చు. ఏరియాల వారిగా గద్దలకొండ గణేష్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 5.90 కోట్లు
సీడెడ్ :2.60 కోట్లు
నెల్లూరు : 0.67 కోట్లు
కృష్ణా : 1.22 కోట్లు
గుంటూరు : 1.42 కోట్లు
వైజాగ్ : 1.97 కోట్లు
ఈస్ట్ : 1.19 కోట్లు
వెస్ట్ : 1.13 కోట్లు
ఏపీ : 7.60 కోట్లు
ఏపీ/ నైజాం : 16.1 కోట్లు
కర్ణాటక : 1 కోటి
అమెరికా 0.87 కోట్లు
రెస్టాఫ్ ఇండియా 0.53 కోట్లు.

Share.