మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.ఈ యేడాది ఇప్పటికే సంక్రాంతికి ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న వరుణ్‌తేజ్ ఇక తాజాగా గద్దలకొండ గణేష్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి రోజు తొలి షోకే మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజులకు 15.77 కోట్ల షేర్ రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ 13.36 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ 15.77 కోట్ల షేర్ కొల్లగొట్టింది. 14 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మురళీ అధర్వ, మృణాళిని హీరోయిన్లుగా నటించారు. ఇక ఇప్పటికే 80 శాతం వసూళ్లు రికవరీ చేసిన గద్దలకొండకు సైరా వచ్చే వరకు తిరుగులేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వరుణ్ సత్తా మరోసారి ఫ్రూవ్ అవ్వగా… హరీష్ శంకర్ కూడా ఈ సినిమాతో మళ్లీ తన రేంజ్ పెంచుకున్నాడు.
గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీకెండ్ షేర్ (రూ.కోట్లలో) :
నైజాం – 4.83
సీడెడ్ – 2.05
వైజాగ్ – 1.63
ఈస్ట్ – 1.07
వెస్ట్ – 0.97
కృష్ణా – 1.06
గుంటూరు – 1.23
నెల్లూరు – 0.52
————————————-
ఏపీ + తెలంగాణ = 13.36 కోట్లు
————————————-
రెస్టాఫ్ ఇండియా – 1.2
రెస్టాఫ్ వరల్డ్ – 1.21
————————————-
వరల్డ్ వైడ్ షేర్ = 15.77 కోట్లు
————————————-