‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. దూసుకుపోతున్న వరుణ్ తేజ్..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది.
4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 17 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ చేసేందుకు దూసుకుపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజుల‌కే 100 శాతం ఆక్యుపెన్సీ సాధించిన ఈ సినిమా నాలుగో రోజు సోమ‌వారం వీక్‌డేస్‌లోనూ అదిరిపోయే షేర్ రాబ‌ట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌కు వ‌సూళ్లు స్ట‌డీగా ఉన్నాయి. సైరా సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఈ సినిమాను ట‌చ్ చేసే వాళ్లే లేరు. గ్యాంగ్‌లీడ‌ర్‌, బందోబ‌స్త్ సినిమాలు పూర్తిగా చ‌ప్ప‌బ‌డిపోయాయి. ఇక బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ గ్రోత్ మరింత పెరిగితే ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకు ఈ సినిమా ఎంత షేర్ రాబ‌డుతుందో ? చూడాలి.

వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ నాలుగు రోజల కలెక్షన్లు (రూ.కోట్ల‌లో) :

నైజాం – 5.23

సీడెడ్ – 2.35

నెల్లూరు – 0.62

కృష్ణ – 1.16

గుంటూరు – 1.35

వైజాగ్ – 1.85

ఈస్ట్ – 1.15

వెస్ట్ – 1.06
——————————–
ఏపీ & టీస్ షేర్ = 14.77
——————————–

Share.