మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ (వాల్మీకి) ఈ శుక్రవారం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తొలి రోజు విడుదలకు కొద్ది గంటల ముందే వాల్మీకి టైటిల్ కాస్త గద్దల కొండ గణేష్‌గా మారిన సంగతి తెలిసిందే. సినిమాకు తొలి ఆటకే మంచి టాక్ వచ్చింది. వరుణ్ పక్కా మాస్ లుక్‌లో అదరగొట్టగా.. దర్శకుడు హరీష్ ఊరమాస్ కథలో సినిమాను బాగా ప్రజెంట్ చేశాడు.
ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దల కొండ గణేష్ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రు. 6.81 కోట్ల షేర్ రాబట్టింది. తొలి రోజు ఈ సినిమాకు ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఈ సినిమాకు పోటీగా వచ్చిన సూర్య బందోబస్తు నిరాశ పరచడం.. ఇటు బాక్సాఫీస్ దగ్గర నాని గ్యాంగ్ లీడర్ స్లో అవ్వడంతో ఈ సినిమాకు సైరా వచ్చే వరకు పోటీ లేనట్టే.. సో బాక్సాఫీస్ దగ్గర వరుణ్ కుమ్ముకోవడం ఖాయమే.
గద్దల కొండ గణేష్ (వాల్మీకి) ఫస్ట్ డే షేర్ (రూ.కోట్లలో) :
నైజాం – 1.86
సీడెడ్ – 0.81
వైజాగ్ – 0.70
ఈస్ట్ – 0.54
వెస్ట్ – 0.58
కృష్ణా – 0.41
గుంటూరు – 0.71
నెల్లూరు – 0.20
———————————–
ఏపీ+తెలంగాణ = 5.81 కోట్లు
———————————–
రెస్టాఫ్ ఇండియా – 0.42
రెస్టాఫ్ వరల్డ్ – 0.58
————————————-
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే షేర్ = 6.81
————————————-