హీరో నుంచి డైరెక్టర్ గా హీరో.. రష్మిక తో సక్సెస్ అయ్యేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Rashmika.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టి తన నటనతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో యువతను బాగా ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత గీతగోవిందం వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Is Rashmika Mandanna collaborating with Rahul Ravindran for a  female-oriented film? | Telugu Movie News - Times of India

ఇక ఇటీవల పాన్ ఇండియా సినిమా పుష్పలో కూడా డి గ్లామరస్ పాత్ర పోషించి.. మరొకసారి ఆకట్టుకున్న రష్మిక.. మరొకవైపు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే.. ఇంకొకవైపు యానిమల్ చిత్రంలో కూడా నటిస్తోంది.దక్షిణాది సినీ ఇండస్ట్రీని తన నటనతో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమ కథ చిత్రం గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్ విడుదల చేయగా.. మొదట చిరునవ్వుతో కనిపించిన ఆమె అంతలోనే విషాదం అలుకున్న ముఖాన్ని చూపించండి.

ప్రస్తుతం ఈ గ్లింప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకి స్వరాలు అందించిన హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు. ఇక మొదటి షెడ్యూల్లో భాగంగా ఈ సినిమా ఊటీలో ప్రారంభం కానుంది . ఇక ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ను త్వరగా కంప్లీట్ చేసి సెట్స్ పైకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రష్మికకు ఏ విధంగా ప్లస్ అవుతుంది అన్నది ఇప్పుడు మరింత ప్రశ్నార్ధకంగా మారింది.

Share.