టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో అడవి శేషు.. ఈ హీరో నటిస్తున్న సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటాయి. అయితే ఈమధ్య ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పెళ్లిళ్లకు సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ..అయితే అందులో అడవి శేషు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యనే అడవి శేషు ఒక అమ్మాయి తో ప్రేమలో పడి వివాహం వరకు వెళ్లబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకు ఆమె ఎవరో కాదు అక్కినేని మేనకోడలు సుప్రియ.అడవి శేషు, సుప్రియ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నా..అలాగే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాలీవుడ్ మీడియాలో వార్తలేనిపిస్తున్నాయి. నిజానికి ఈ జంట ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కానీ అడవి శేషు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వివాహాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు అడవి శేషు వారి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.. వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అడవి శేష్ ఏదైనా పండుగ జరిగినా ఈవెంట్ జరిగిన కూడా అక్కినేని ఫ్యామిలీతోనే కాస్త క్లోజ్ గా ఉంటాడు. అంతేకాకుండా నాగార్జున ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా క్రిస్మస్ లాంటి పండుగలు జరిగిన తను సుప్రియ పక్కనే కూర్చున్నాడు. గతంలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
అంతేకాకుండా రామ్ చరణ్ బర్త్ డే ఫంక్షన్ లో సుప్రియ అడవిశేష్ ఇద్దరు కలిసి కార్లో నుంచి దిగిన ఫోటోలు మీడియా కంటపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ జంటగా వెళ్లడంతో త్వరలోనే వీళ్ళ పెళ్లి ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి పెళ్లికి పెద్దగా నాగచైతన్య వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.వీరిద్దరి పెళ్లి చేయటానికి ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించారట. ఈ ఏడాది జూన్ 16న వీరి పెళ్లి జరగబోతుందని సమాచారం.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.