టాలీవుడ్ లో సెన్సేషనల్ పేరుగా మారింది నటి పవిత్ర లోకేష్.. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. గతంలో రెండు మూడు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. నటుడు నరేష్ తో రిలేషన్షిప్ లో ఉన్నదంటూ పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలు నిజమేనంటూ కూడా వీరిద్దరూ ప్రకటించడం జరిగింది. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
అయితే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 26న విడుదలై మీశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే నరేష్, పవిత్ర లోకేష్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. పవిత్ర లోకేష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఇద్దరు హీరోలు అంటే క్రష్ అని తెలియజేసింది.. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాగార్జున గారు నటించిన గీతాంజలి సినిమా విడుదల అయింది ఆ సినిమా చూసినప్పుడు ఆయన అంటే క్రష్ ఏర్పడిందని తెలిపింది.
ఆ సమయంలో నా భర్త అంటే ఇలాంటి వ్యక్తి ఉండాలన్న ఫీలింగ్ కలిగేది అని తెలిపింది. నాగార్జున తర్వాత అదే రేంజ్ లో తనకు నచ్చిన మరొక నటుడు ప్రకాష్ రాజ్ అని తెలిపింది. వీరిద్దరూ నా క్రష్ అంటు ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తెలియజేసింది ప్రస్తుతం పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవిత్ర లోకేష్ కి గతంలో వివాహమయ్యి విడాకులు తీసుకుంది. వీకే నరేష్ కు కూడా ప్రస్తుతం మూడు పెళ్లిళ్లు అయ్యాయి. త్వరలోనే పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోవాలని చాలా మోజు పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరూ వివాహం చేసుకుంటారేమో చూడాలి మరి.