అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే క్లాస్ మాస్ ఆడియన్స్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. చివరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉందని చెప్పవచ్చు. అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి సినీ పరిశ్రమలోకి అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో మొదటిసారి హీరోగా మారాడు అంతకుముందు స్వాతిముత్యం, డాడీ అంటే చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించారు. అయితే ఈ చిత్రాలలో పెద్దగా గుర్తింపు రాలేదు.
పేరుకే హీరో అయితే గంగోత్రి సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. సక్సెస్ అంతా కూడా కీరవాణి రాఘవేంద్రరావుకు 100 వ సినిమాకు హైపుకు చేరిపోయింది.అయితే ఆ తర్వాత తన లుక్స్ మొత్తం మార్చుకున్న అల్లు అర్జున్ కష్టపడి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా డైరెక్టర్ తో అల్లు అర్జున్ చాలా ఫ్రెండ్లీ గా ఉండేవారు. తన సినిమాలో సక్సెస్ మీట్లో సీనియర్ దర్శకులను కూడా పిలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా త్రివిక్రమ్, సుకుమార్ వంటి దర్శకులతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
అయితే ఓ దర్శకుడు అంటే అల్లు అర్జున్ కు చాలా భయమట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. పెళ్ళాం ఊరెళితే సినిమాకి అల్లు అర్జున్ ఎస్వీ కృష్ణారెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారట. ఆ సినిమాకి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నిర్మాత అయితే ఎస్వి కృష్ణారెడ్డి సెట్ లో బన్నీతో సహా అందరిని డిస్ప్లేన్ గా ఉంచేవారట. అందువల్ల కృష్ణారెడ్డి అంటే అల్లు అర్జున్ కు ఏదో తెలియని భయం. ఇప్పటికి కూడా ఆయన ఎదురైతే అల్లు అర్జున్ తడబడుతూ ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఎన్నోసార్లు తెలియజేసినట్లు సమాచారం.