స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మాయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటోంది. చాలాకాలం తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలు వేడుకలు మీడియా ముందుకు వచ్చి పూర్తిగా మారిపోయి గ్లాసెస్ చేతిలో జపమాలతో సరికొత్త లుక్కులో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే అటు సోషల్ మీడియాలో కూడా మళ్లీ యాక్టివ్ గా మారిపోయింది సమంత. ఎప్పటికప్పుడు తాను వర్కౌట్ చేస్తున్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన తదుపరి ప్రాజెక్టు అనౌన్స్మెంట్ ఇస్తూ మళ్లీ ఫాలోవర్స్తో ఇంట్రాక్ట్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే సమంత తిరిగి తన నెక్స్ట్ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపించాయి. ఇక ఈ మధ్యనే సమంత అనారోగ్య సమస్యతో కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు .తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది అని అందరూ అనుకున్నారు.
We all await your return in full health and your big smile ❤️ https://t.co/kuSN1ZdGj3
— Vijay Deverakonda (@TheDeverakonda) February 1, 2023
కానీ బాలీవుడ్ లో రూపొందించిన సిటాడెల్ చిత్రంలో పాల్గొంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికన్ స్పైస్ పిక్స్ అండ్ రామా అయిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మెన్ దర్శకులు రాజు అండ్ డీకే దీనిని తెరకెక్కిస్తూ ఉన్నారు.తాజాగా విచిత్రంలో సమంత పాల్గొన్నట్లు అధికారికంగా ప్రకటన వెలుబడింది దీంతో విజయ దేవరకొండ చిత్రానికి సమంత డేట్స్ ఇవ్వడం లేదంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక అభిమాని ట్విట్టర్ వేదికగా సమాధానం ప్రశ్నించారు. విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు ఖుషి షూటింగ్ అతి త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతోంది అంటూ ఒక గుడ్ న్యూస్ తెలిపింది.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023