సాహోపై అభిమానుల అసంతృప్తి..

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర యూనిట్ పై ప్రభాస్ అభిమానులు గుర్రుగా ఉన్నారా…? అసలు సాహో సినిమాలో ప్రభాస్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం శ్రద్ధ కపూర్ కు ఇవ్వడం ఏంటీ…? అసలు చిత్రం తెలుగులో తీస్తున్నారా..? లేక హిందిలో తీసి, తెలుగుకు డబ్ చేస్తున్నారా..? అని ప్రభాస్ అభిమానులు తెగ ఇదై పోతున్నారట.

ప్రభాస్ అభిమానులకు సాహో చిత్ర యూనిట్ వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదట. దీంతో సాహో చిత్ర యూనిట్ ఇలాగే చేస్తే, అభిమానులు ఆగ్రహిస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతలా ప్రభాస్ అభిమానులు గుర్రుగా ఉండటానికి కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తే అసలు విషయం బోధపడింది. సాహో సినిమాలోని సైకో సైయాన్ అనే పల్లవితో ప్రారంభమయ్యే పాటను ఈనెల 8న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఘనంగా ప్రకటించింది. ఈ సాంగ్ టీజర్ను ఇటీవల విడుదల చేశారు. కాని ఇందులో ప్రభాస్ కన్నా హీరోయిన్ శ్రద్ధా కపూర్ను హైలెట్ చేస్తూ చూపారట. దీంతో అభిమానుల ఆగ్రహానికి కారణమైందట.

అసలు శ్రద్ధ కపూర్ కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారటంటే ఈ సినిమాను బాలీవుడ్ జనాల కోసమే తీస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అంటే తెలుగులో తీసిని బాహుబలి ని తరువాత హింది, ఇతర భాషల్లోకి డబ్ చేశారు. ఇప్పుడు బాహుబలి లాగా కాకుండా సాహోను హిందిలో తీసి తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేస్తున్నారట. దీంతో తెలుగులో కనుక డబ్ చేస్తే సాహో సినిమా అసలే బాగుండదని, ఇది ప్రభాస్ కేరీర్కు నష్టం కలిగిస్తుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

Share.