హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం f-3, ఇందులో కథానాయకులుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎఫ్2 కి సీక్వెల్ గా నిర్మించబడుతోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నాడు. ఈ సినిమాని అప్పట్లో విడుదల చేయాలని ఎన్నో అంచనాలతో షూటింగ్ మొదలు పెట్టగా.. కరోనా కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అయిందని చెప్పవచ్చు.
దాని కారణంగానే సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు అటు మెగా అభిమానులకు, దగ్గుబాటి ఫాన్స్ కి ఒక శుభవార్త తెలుపుతూ.. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఏప్రిల్ 29 న ఈ సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఇది విన్న ప్రతి ఒక్కరూ నిరాశ చెందారు అని చెప్పవచ్చు.