ఎక్స్ట్రా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ టీం.. వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో ఎంతోమంది తమ ప్రతిభను కనబరచుకోడానికి కామెడీ పండించి.. సినిమాలలో కూడా అవకాశాలు తెచ్చుకోవడం గమనార్హం. ఇప్పటికీ చాలామంది సినీ ఇండస్ట్రీ లో ఉండే కమెడియన్లు మొదట జబర్దస్త్ స్టేజ్ పైన కమెడియన్ లు గా పనిచేసిన వారే. ఇప్పుడు చాలామంది జబర్దస్త్ స్టేజ్ పైన ఎంతో పాపులారిటీ సంపాదించుకొని, సినిమాలలో అవకాశాలు తెచ్చుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే యాంకర్ అనసూయ , యాంకర్ రష్మీ లాంటి వాళ్ళు బాగా పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత సినిమాలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ , గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ వంటి వారు జబర్దస్త్ కి దూరం కానున్నట్లు సమాచారం. అంతేకాదు వీరు ముగ్గురు జబర్దస్త్ కి దూరం కాబోతున్నారు అనే వార్త గత కొద్దిరోజుల నుంచి వినిపిస్తున్నప్పటికీ పెద్దగా వీరు స్పందించలేదు. కానీ తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో వీరు నిజంగానే జబర్దస్త్ నుంచి వెళ్లి పోతున్నాము అంటూ బహిరంగంగానే చెప్పడం తో ఈ విషయం కాస్తా సంచలనంగా మారింది. చివర్లో ముగ్గురు ఒకరికి ఒకరు పట్టుకొని ఏడవడం మనం ఈ ప్రోమో లో చూడవచ్చు. సుధీర్ కు, శ్రీనుకు సినిమాలలో అవకాశాలు వచ్చినట్లు.. ఇక రామ్ ప్రసాద్ కు కొన్ని సినిమాలకు రైటర్ గా పని చేసే అవకాశం వచ్చినట్లు సమాచారం. వీరు ముగ్గురూ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్నారట.

Share.