తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులరిటి సంపాదించుకున్న నటులలో రామ్ చరణ్ కూడా ఒకరు.. మెగా కుటుంబంలో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. మెగా కుటుంబంలో హీరోల కన్నా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేది రామ్ చరణ్ నే.. ఇటీవలే రామ్ చరణ్ తండ్రి కూడా అయ్యాడు. రామ్ చరణ్ కు ఒక కూతురు పుట్టిన సంగతి మనకు తెలుసు ఇక పాప పేరు కూడా క్లిన్ కార అని నామకరణం కూడా చేశారు. అయితే ఇది కాస్త పక్కన పెడితే..
రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .అయితే రామ్ చరణ్ ,ఉపాసనను ప్రేమించిన విషయాన్ని సీక్రెట్ గానే మెయింటెన్ చేశాడట. అయితే చిరంజీవి ఒక స్టార్ హీరో కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి స్టార్ హీరో కమలహాసన్ తనకూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారట. అయితే రామ్ చరణ్, ఉపాసనను ప్రేమించిన సంగతి తన తండ్రికి చెప్పటానికి భయపడి చెప్పలేదట. అయితే కమలహాసన్ ని ఇంటికి పిలిచి శృతిహాసన్, రామ్ చరణ్ పెళ్లి గురించి టాపిక్ రావటంతో రామ్ చరణ్ కంగారుపడి ఉపాసనకి అన్యాయం జరుగుతుందని వెంటనే తన మనసులోని మాట బయటకు చెప్పాడు.
ఇక దాంతో కమలహాసన్ చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడట. కానీ చిరంజీవి మాత్రం మాకు ముందే ఈ విషయాన్ని చెబితే ఆయనని ఇంటికి రమ్మని వాడిని కాదు అని అన్నారట.అయితే రామ్ చరణ్ నాన్న నాకు ఈ విషయం చెప్పడానికి భయమేసింది అందుకే చెప్పలేదు అని అన్నాడట.. ఇలా రామ్ చరణ్ కమలహాసన్ కి అల్లుడు అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాడు. ఒకవేళ శృతిహాసన్ రామ్ చరణ్ వివాహం చేసుకొని ఉంటే ఎలా ఉండేది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.