తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు ఈ మధ్యకాలంలో తరచు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రాకపోవడంపై ఎప్పటినుంచో పలు నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా మీటు ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించడం జరిగింది. తాజాగా తెలుగు అమ్మాయిగా పేరుపొందిన హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ విషయంపై స్పందించినట్లుగా తెలుస్తోంది.
ఈమె గతంలో హీరోయిన్గా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో ఎక్కువ రోజులు హీరోయిన్గా రాణించలేకపోయింది. ఈషా రెబ్బా కు వచ్చిన అవకాశాలన్నీ కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ అవకాశాలు అని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం మలయాళం లో ఒక చిత్రంలో హీరోయిన్గా నటించిన అయితే తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు విషయాలను తెలియజేసింది.
ఈషా రెబ్బా మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడానికి చాలానే కారణాలు ఉంటాయి.తెలుగు అమ్మాయిలు కమిట్మెంట్లు ఇవ్వరు అందుకే వారికి ఎక్కువగా అవకాశాలు రావట్లేదని ఆరోపణలలో కచ్చితంగా నిజం ఉందని కానీ ఇప్పటివరకు తనకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ ఎదురు కాలేదని కేవలం తన సొంత టాలెంట్ తోనే అవకాశాలు వస్తున్నాయని తెలుపుతోంది ఈషా రెబ్బా ..తన దగ్గర మాత్రం కొంతమంది ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్టుగా తెలియజేశారని తెలిపింది.
అయితే వచ్చిన అవకాశాన్నిలను ఉపయోగించుకొని ఆ పాత్రలకు మనం సేటిస్ఫై గా చేశామంటే చాలు ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తాయని తెలుపుతోంది. కాబట్టి నేను వచ్చిన వాటితోనే ఇబ్బంది పడకుండా పాత్రలలో నటిస్తూ చేస్తున్నానని తన అభిప్రాయంగా తెలియజేసింది ఈషా రెబ్బా. ప్రస్తుతం ఈషా రెబ్బా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.