జీవితంలో ఇంకెప్పుడు ఆ పని చేయను, మీరు చేయకండి: నటి ఈషా రెబ్బ

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటి ఈషా రెబ్బ తన ట్విట్టర్ ద్వారా ప్రముఖ విమానాయనా సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ పై విరుచుకు పడ్డారు. రాజీవ్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ లో ” నేను ఈ వారం ఇండిగో విమానం మిస్ అవ్వడం ఇది రెండో సారి వారి సంస్థ కంటే అందులో పని చేస్తున్న ఉద్యోగులకే బాగా ఇగో అని తెలిపారు, నేను ముందుగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా ఇండిగో ఉద్యోగులు నన్ను ఒక్క నిమిషం వెయిట్ చేయండని చెప్పారు, అటు తర్వాత నన్ను 10 నిమిషాల పాటు వెయిట్ చేయించారు, నేను విమానం ఎక్కేందుకు వెళ్లగా మీరు 5 నిముషాలు ఆలస్యం అయినందున విమానం వెళ్లిపోయిందని అక్కడున్న ఇండిగో సిబ్బంది సమాధానం ఇచ్చారు. నేను ఇదేంటని అడిగితే మా సంస్థ రూల్స్ ఇలాగే ఉంటాయ్ అని చెప్పారు.

ఇక ఇదే ట్వీట్ ని నటి ఈషా రెబ్బ రీట్వీట్ చేస్తూ ” మీరు చెప్పింది నిజమే అని, నేను కూడా ఇండిగో సంస్థ నుండి ఇదే విధమైన పరిస్థితి చాల సార్లు ఎదుర్కున్న, ఇక నేను ఎప్పటికి ఇండిగో విమానం లో ప్రయాణం చేయనని.. వారు రూల్స్ ని సరిగా పాటించే వరకు మీరు కూడా ఇండిగో ఫ్లైట్స్ లో ప్రయాణం చేయకండని ” తెలిపారు ఈషా రెబ్బ.

Share.